రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు రవి కిరణ్
నవతెలంగాణ – పాలకుర్తి
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు రవికిరణ్ అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీ రెండో సాధారణ ఎన్నికల్లో భాగంగా మూడో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో బుధవారం స్టేషన్ ఘన్పూర్ ఆర్డీవో డిఎస్ వెంకన్నతో కలిసి ఎన్నికల పరిశీలకులు రవికిరణ్ పాలకుర్తి నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు.
నామినేషన్ల స్వీకరణ పట్ల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రవికిరణ్ మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ సందర్భంగా సర్పంచు, వార్డు మెంబర్లకు నామినేషన్లు వేసే అభ్యర్థులు గ్రామపంచాయతీ నుండి నో డ్యూ సర్టిఫికెట్లతో పాటు ఎన్నికల నిబంధనలో పొందుపరిచిన ధృవపత్రాలు సమర్పించే విధంగా చూసుకోవాలని తెలిపారు. క్లస్టర్ల వారీగా నియమించబడిన గ్రామాలు మాత్రమే క్లస్టర్లలో నామినేషన్లు దాఖలు అయ్యే విధంగా ముందస్తు సమాచారాన్ని ఆయా గ్రామాలకు అందించాలని ఆదేశించారు. గ్రామాల నుండి సర్పంచ్ అభ్యర్థితోపాటు వార్డు సభ్యులకు ఒక్కొక్క నామినేషన్లు వస్తే గ్రామసభలను ఏర్పాటు చేసి ప్రజల సమక్షంలో ఆమోదింపజేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
నామినేషన్ల స్వీకరణకు సమయపాలన పాటించాలని తెలిపారు. రాజ్యాంగబద్ధంగా ప్రతి ఓటరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సూత్రం సరస్వతి, ఎంపీడీవో వర్కల వేదవతి, ఎంపీఓ హరినాథ్ రెడ్డి, ఎస్సై మేకల లింగారెడ్డి, పంచాయతీ కార్యదర్శు లు వెంకటాచారి, చంద్రశేఖర్ లతోపాటు నామినేషన్ స్వీకరణ సిబ్బంది పాల్గొన్నారు.
,



