అన్ని ఫార్మాట్‌ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన
ఛండీగడ్: టీమిండియా పేసర్ మోహత్ శర్మ క్రికెట్ అన్ని ఫార్మాట్‌ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ’14ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ ప్రయాణం ఇక ముగిసింది’ హర్యానా తరఫున ప్రాతినిధ్యం వహించినందుకు గర్వపడుతున్నా.. నేను భారత జెర్సీని ధరించడం, ఐపిఎల్‌లో ఆడడం కెరీర్‌లో మరచిపోలేనివి’ అంటూ బుధవారం ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వెల్లడించాడు. తనకు వెన్నెముకగా నిలిచిన హర్యానా క్రికెట్ అసోసియేషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. అలాగే అనిరుద్ సార్ మార్గదర్శకత్వంతో, అతనికి నాపై నమ్మకం నిరంతరం మరచిపోలేను. తనకు మద్దతుగా నిలిచిన కోచ్‌లు, ఐపిఎల్ ఫ్రాంచైజీలు, సహాయ సిబ్బంది, స్నేహితులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మోహిత్ శర్మ.. టీమిండియా తరఫున 14 వ్డేలు, 8టి20లు ఆడాడు. ఈ రెండు ఫార్మాట్‌లలో కలిపి మొత్తం 37వికెట్లు పడగొట్టాడు. 2015 ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు సెమీస్‌కు చేరడంలో మోహిత్ శర్మ కీలకపాత్ర పోషించాడు.
మోహిత్ శర్మ గుడ్‌బై
- Advertisement -
- Advertisement -



