తెలుగు సినిమా తొలితరం నేపథ్యగాయకులలో ఒకరు, దిగ్గజ సంగీత దర్శకుడు, తన విలక్షణమైన బాణీలతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఘంటసాల బయోపిక్ రూపొందించారు దర్శకుడు సి.హెచ్.రామారావు. ఘంటసాల జీవితాన్ని ఆధారంగా చేసుకుని, ఆయన లైఫ్‌లోని విభిన్న ఘట్టాలను ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించి కేవలం ప్రివ్యూ షోలతోనే ప్రేక్షకులతో ఔరా అనిపించారు. ఈ సినిమాలో కృష్ణ చైతన్య ఘంటసాలగా, మృదుల ఘంటసాల సావిత్రమ్మగా, చిన్న ఘంటసాలగా తులసి మూవీ ఫేమ్ అతులిత నటించగా.. సుమన్ ముఖ్య పాత్రను పోషించారు.
ఘంటసాల వీరాభిమానుల కోరిక మేరకు లండన్, సింగపూర్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో ప్రత్యేక ప్రీవ్యూ షోలు నిర్వహించగా.. అక్కడి భారతీయులు ఈ చిత్రాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘ఘంటసాల గాత్రం, గౌరవం, మహిమను మరోసారి అనుభవించే అవకాశం ఇచ్చింది’ అని వాళ్లంతా అక్కడి మీడియాకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల కోసం, వరల్డ్ వైడ్ ఆడియన్స్ కోసం ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధం చేశారు మేకర్స్. ఈ నెల 5వ తేదీన హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది అని చిత్రయూనిట్ తెలిపింది.
‘ఘంటసాల ది గ్రేట్’ రిలీజ్‌కి రెడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



