టి20 సిరీస్‌కు టీమిండియా జట్టు ప్రకటన
ముంబయి: దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు టి20 సిరీస్‌కు భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు (బీసీసీఐ) జట్టును ప్రకటించింది. బీసీసీఐ బుధవారం ప్రకటించిన 15మంది ఆటగాళ్లలో కూడిన జట్టులో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు చోటు దక్కింది. అలాగే తొలి టెస్ట్‌లో గాయపడ్డ శుభ్‌మన్ గిల్ ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉండగా.. అతనికి కూడా జట్టులో చోటు లభించింది. అయితే, గిల్ అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది ఫిట్‌నెస్ నివేదికపై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. పూర్తిగా ఫిట్‌నెస్ సాధిస్తేనే టి20 సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నారు. ఆసియా కప్ ఫైనల్‌కు ముందు గాయపడిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులో చేరాడు.
డిసెంబర్ 9 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు టి20 సిరీస్ జరగనుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికాపై విజయం సాధించి.. టి20 ప్రపంచకప్‌కు సన్నద్ధం కావాలని చూస్తోంది. వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ జితేశ్ శర్మ, సంజు శాంసన్ ఇద్దరికి చోటు దక్కింది. ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా టి20 జట్టులోకి మళ్లీ తిరిగి వచ్చాడు. బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాను చోటు కల్పించారు. అయితే, రింకు సింగ్, యువ బ్యాట్స్‌మెన్ యశస్వీ జైస్వాల్‌కు చోటు దక్కలేదు. జట్టు : సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), శుభమన్, అభిషేక్, తిలక్ వర్మ, హార్దిక్, దూబే, అక్షర్, జితేష్, సంజు శాంసన్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్, కుల్దీప్, హర్షిత్, సుందర్.



