Thursday, December 4, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఎనిమిది యుద్ధాలు ఆపా : ట్రంప్‌

ఎనిమిది యుద్ధాలు ఆపా : ట్రంప్‌

- Advertisement -

భారత్‌-పాక్‌ ఒప్పందానికి నేనే కారణం
ప్రతి యుద్ధానికీ నోబెల్‌ ఇచ్చి ఉండాల్సింది


వాషింగ్టన్‌ : భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఘర్షణను తానే నివారించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి చెప్పుకొచ్చారు. ఎనిమిది యుద్ధాలను నివారించానని అంటూ వాటిలో ప్రతి దానికీ తనకు నోబెల్‌ శాంతి బహుమతి ఇచ్చి ఉండాల్సిందని అన్నారు. ‘మేము ఎనిమిది యుద్ధాలను ఆపాము. మరో యుద్ధాన్ని ఆపబోతున్నాము. నేను అలా అనుకుంటున్నాను. ఆశిస్తున్నాను’ అని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ మంగళవారం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నేను యుద్ధాన్ని ఆపిన ప్రతిసారీ వారు ఓ మాట చెప్పే వారు. అధ్యక్షుడు ట్రంప్‌ యుద్ధాన్ని ఆపితే ఆయనకు నోబెల్‌ బహుమతి వస్తుందని అనే వారు.

నేను ఓ యుద్ధాన్ని ఆపినప్పుడు మాత్రం అందుకోసం ఆయనకు నోబెల్‌ బహుమతి రాదని, మరో యుద్ధాన్ని ఆపితే వస్తుందని చెప్పే వారు’ అని అన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపితే నోబెల్‌ వస్తుందని ఇప్పుడు చెబుతున్నారని ట్రంప్‌ అన్నారు. ‘మరి ఆ ఎనిమిది యుద్ధాల మాటేమిటి? భారత్‌, పాకిస్తాన్‌…ఇలా అన్ని యుద్ధాలనూ నేనే ఆపాను. ప్రతి యుద్ధానికీ నాకు నోబెల్‌ ఇచ్చి ఉండాల్సింది. అత్యాసతో ఉండాలని నేనేమీ అనుకోవడం లేదు’ అని చెప్పారు. యుద్ధాల కారణంగా ప్రాణాలు కోల్పోయే వారి గురించే తాను ఎక్కువగా ఆలోచిస్తానని తెలిపారు. తాను నోబెల్‌ శాంతి బహుమతికి అర్హుడినేనని ఈ సంవత్సరపు విజేత పరిస్కా చెప్పారని గుర్తు చేశారు.

నిద్రలో జోగుతూ…
మూడు గంటల పాటు జరిగిన అమెరికా క్యాబినెట్‌ సమావేశంలో ట్రంప్‌ అనేక సార్లు నిద్రలోకి జారుకున్నారు. 79 సంవత్సరాల ట్రంప్‌ కళ్లు మూస్తూ తెరుస్తూ ఉన్న దృశ్యాలను కెమేరాలు బంధించాయి. ఒక సందర్భంలో అయితే ఆయన పూర్తిగా నిద్రలోకి వెళ్లిపోయారు. వాణిజ్య మంత్రి హోవర్డ్‌ లుత్నిక్‌ మాట్లాడుతున్న సమయంలో ట్రంప్‌ కొద్దిసేపు నిద్రపోయినట్లు కన్పించింది. సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌ సోషల్‌లో ఆయన 160కి పైగా పోస్టులు షేర్‌ చేసి అలసిపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -