పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు
12 మంది మావోయిస్టులు, ముగ్గురు జవాన్లు మృతి
వివరాలు వెల్లడించిన బస్తర్ ఐజీ సుందర్‌లాల్
నవతెలంగాణ-చర్ల
పచ్చని బీజాపూర్ అడవుల్లో రక్తపుటేరులు పారాయి. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు, ముగ్గురు జవాన్లు మృతి చెందారు. బస్తర్ ఐజీ సుందర్‌లాల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ-బీజాపూర్ జిల్లా సరిహద్దు దండకారణ్యంలో బుధవారం భద్రతా దళాలు 12 మంది మావోయిస్టులను హతమార్చాయి. ఇందులో డివిజనల్ కమిటీ సభ్యుడు (డీవీసీఎం) వెల్ల మోడియం కూడా ఉన్నారు. ముగ్గురు డీఆర్జీ జవాన్లు సైతం మృతి చెందినట్టు ఐజీ తెలిపారు. అందరి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి ఒక ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్, 303 రైఫిల్ మందు గుండు సామగ్రిని రికవరీ చేసినట్టు చెప్పారు.
కాగా దండకారణ్యాన్ని భద్రతాబలగాలు భారీగా మోహరించాయి. బీజాపూర్ డీఆర్‌జీ సైనికులు, హెడ్ కానిస్టేబుల్ మోను వాడరి, రమేష్ సోడి, కానిస్టేబుల్ దుకారు గొండేలు ఈ ఎన్‌కౌంటర్‌లో అమరులయ్యా రని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ పి. పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు వారు వివరించారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ (డీఆర్‌జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్), కోబ్రా, సీఆర్‌పీఎఫ్ ల సంయుక్త బృందం బుధవారం ఉదయం నుంచి బీజాపూర్-దంతేవాడ సరిహద్దులోని పశ్చిమ బస్తర్ డివిజన్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు పోలీస్ సూపరింటెండెంట్ జితేంద్ర యాదవ్ తెలిపారు.
బీజాపూర్ అడవుల్లో రక్తపుటేర్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



