– బీమా కవచ్, ప్రొటెక్షన్ ప్లస్ ఆవిష్కరణ
నవతెలంగాణ – హైదరాబాద్
ప్రభుత్వ రంగంలోని దిగ్గజ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) కొత్తగా రెండు పాలసీలను విడుదల చేసింది. బీమా కవచ్, ప్రొటెక్షన్ ప్లస్ పేరుతో వీటిని బుధవారం ఎల్‌ఐసీ సీఈఓ, ఎండీ ఆర్ దొరైస్వామి ఆవిష్కరించారు. ఎల్‌ఐసీ బీమా కవచ్ రిస్క్ కవర్ అందించే ప్లాన్. పెట్టుబడి లాభాపేక్ష లేకుండా కేవలం కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలని కోరుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుందని ఎల్‌ఐసీ తెలిపింది. ఇది నాన్-పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్, ఇండివిడ్యువల్ ప్యూర్ రిస్క్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఈ పాలసీ వ్యవధిలో పాలసీదారు దురదృష్టవశాత్తూ మరణిస్తే నామినీకి హామీ ఇవ్వబడిన ప్రయోజనాన్ని అందిస్తుంది. కనీస మ్యాచూరిటీ 28 ఏండ్లుగా.. గరిష్ట పరిమితి వందేండ్లుగా నిర్ణయించింది.ఎల్‌ఐసీ ప్రొటెక్షన్ ప్లాన్‌లో జీవిత బీమా కవరేజీతో పాటు మార్కెట్-లింక్డ్ పొదుపు ప్రయోజనాలను కలిపి అందిస్తుంది. పాలసీదారులు తమ ప్రీమియంలను వివిధ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఇది నాన్-పార్టిసిపేటింగ్, లింక్డ్, ఇండివిడ్యువల్ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. భద్రత, పెట్టుబడి లక్షణాలు రెండూ కోరుకునే వారికి ఈ ప్లాన్ అనువుగా ఉంటుంది. ఫండ్లు, క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టబడతాయి కాబట్టి పాలసీ విలువ మార్కెట్ ప్రమాదాలకు లోబడి ఉంటుందని ఎల్‌ఐసీ తెలిపింది. ఈ పాలసీని 5,7,10,15 ఏండ్ల కాలపరిమితితో ఎంచుకోవచ్చు.
ఎల్‌ఐసీ నుంచి రెండు కొత్త ప్లాన్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



