– డాక్టర్ ఇ.నవీన్ నికోలస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి కేజీబీవీ సీఆర్టీ పీఈటీ బి.గౌతమీ రతన్ సాధిస్తున్న విజయాలు అనేక మందికి స్ఫూర్తినిస్తాయని పాఠశాల విద్యా సంచాలకులు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఇ.నవీన్ నికోలస్ ప్రశంసించారు. 2013 నుంచి విధులు నిర్వహిస్తున్న గౌతమీ అంకితభావంతో కేజీబీవీ బాలికలను యోగా, క్రీడల్లో ప్రోత్సహిస్తున్నది. ఆమె చేసిన కృషి ఆ పాఠశాల బాలికలు 2019 నుంచి ప్రతి ఏటా రాష్ట్ర, జాతీయ స్థాయి యోగా ఛాంపియన్‌షిప్స్‌కు ఎంపికవుతున్నారు. ఇటీవల స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో ఆ విద్యాలయం నుంచి 9 మంది విద్యార్థినీలు జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. గౌతమీ ఇచ్చే శిక్షణ, బాలికల క్రీడా కాంక్షను తీర్చేందుకు అవసరమైన నిధుల సమీకరణకు ఆమె ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటారు. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యా సంచాలకుల కార్యాలయంలో ఆమెను నికోలస్ ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంకితభావం కలిగిన గౌతమీ లాంటి టీచర్లు బాలికల జీవితాలను ఉజ్వలంగా మారుస్తున్నారని ప్రశంసించారు. ఆమె అభ్యాసంలో క్రీడాకారిణులుగా రాణిస్తున్న బాలికలు అనేక మంది బాలికలకు స్ఫూర్తినిస్తున్నారని తెలిపారు.
గౌతమి రతన్ పలువురికి స్ఫూర్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



