Thursday, December 4, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా కీలక నిర్ణయం

అమెరికా కీలక నిర్ణయం

- Advertisement -

– ఆ 19 దేశాల నుంచి ఇమ్మిగ్రేషన్‌ దరఖాస్తులు నిలిపివేత
వాషింగ్టన్‌ :
అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. 19 దేశాల ప్రజల నుంచి వచ్చే గ్రీన్‌ కార్డులు, పౌరసత్వ అభ్యర్థనలు, వీసాలు వంటి ఇమ్మిగ్రేషన్‌ దరఖాస్తులన్నీ తాత్కాలికంగా నిలిపివేసింది. వాషింగ్టన్‌ డీసీలో జరిగిన కాల్పుల ఘటన తర్వాత ట్రంప్‌ ప్రభుత్వం తన పరిశీలన విధానాలను తిరిగి పరిశీలిస్తోందని న్యూయార్క్‌ టైమ్స్‌ నివేదిక పేర్కొన్నది. దీంతో ఈ సమయంలో యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) అధికారులు అన్ని దరఖాస్తులను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించినట్టు వివరించింది. ఈ 19 దేశాలు ఇప్పటికే ట్రంప్‌ అమలు చేసిన ట్రావెల్‌-బ్యాన్‌ జాబితాలో ఉన్నవే. ఈ ప్రభావిత దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్‌, మయన్మార్‌, చాద్‌, కాంగో రిపబ్లిక్‌, ఈక్వాటోరియల్‌ గినియా, ఎరిట్రియా, హైతి, ఇరాన్‌, లిబియా, సోమాలియా, సూడాన్‌, యెమెన్‌, బురుందీ, క్యూబా, లావోస్‌, సియెర్రా లియోన్‌, టోగో, టుర్క్‌మెనిస్తాన్‌, వెనిజులాలు ఉన్నాయి.

గతవారం వాషింగ్టన్‌ డీసీలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు నేషనల్‌ గార్డ్‌ సభ్యులు గాయపడగా.. వారిలో ఒకరు మరణించారు. ఈ ఘటనతో సంబంధమున్న ఆఫ్ఘన్‌ మూలాలున్న వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఆ వ్యక్తి యూఎస్‌-ఆఫ్ఘనిస్తాన్‌ యుద్ధ సమయంలో సీఐఏతో పని చేశాడని తెలిసింది. దీనిని కారణంగానే చూపుతూ ఆ దేశాల నుంచి వచ్చే వలసలను పూర్తిగా నిలిపివేస్తున్నామని ట్రంప్‌ చెప్పటం గమనార్హం. ఇటు వీసాలపై యూఎస్‌ మరింత కఠినంగా వ్యవహరిస్తున్నది. ఆఫ్ఘన్‌ పాస్‌పోర్ట్‌తో ప్రయాణించే వారిఇక వీసాలు ఇవ్వడాన్ని నిలిపివేస్తున్నట్టు అమెరికా విదేశాంగా మంత్రి మార్కో రూబియో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -