Thursday, December 4, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌తో లులా హలో..హలో..

ట్రంప్‌తో లులా హలో..హలో..

- Advertisement -

వాణిజ్యం, ఆర్థిక పరిస్థితులు, వ్యవస్థీకృత నేరాలపై చర్చ
కొత్త భాగస్వామ్యంతో మంచి ఫలితాలు : అమెరికా అధ్యక్షుడు
ఇద్దరి మధ్య ఫలవంతమైన చర్చ జరిగింది : బ్రెజిల్‌


వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, బ్రెజిల్‌ అధ్యక్షుడు లుయిస్‌ ఇనాసియో లులా డ సిల్వా లు మంగళవారం ఫోన్‌లో సంభాషించుకున్నారు. వాణిజ్యం, ఆర్థిక పరిస్థితులు, వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా పోరాటం వంటి పలు అంశాలపై ఇరు దేశాధినేతలూ చర్చించుకున్నారు. వారిద్దరి మధ్య 40 నిమిషాల పాటు ఫోన్‌ సంభాషణ జరిగినట్టు తెలుస్తున్నది. ఈ విషయాన్ని రెండు దేశాలకు చెందిన అధికార వర్గాలు తెలిపాయి. తమ చర్చలో ఆంక్షల గురించి కూడా మాట్లాడినట్టు వైట్‌హౌజ్‌లో రిపోర్టర్లతో మాట్లాడుతూ ట్రంప్‌ చెప్పారు. ”నాకు, లులాకు మధ్య మంచి సంభాషణ జరిగింది. వాణిజ్యం, ఆంక్షలపై చర్చ జరిగింది” అని ఆయన అన్నారు. లులాను త్వరలో చూడటానికి, మాట్లాడటానికి ఎదురు చూస్తున్నాను. ఈ కొత్త భాగస్వామ్యంతో చాలా మంచి ఫలితాలు వస్తాయి” అని ట్రంప్‌.. సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు.

కాఫీ, బీఫ్‌ సహా బ్రెజిల్‌ ఉత్పత్తులపై అమెరికా అదనపు సుంకాలు తొలగించడాన్ని లులా ప్రశంసించారనీ, ట్రంప్‌ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారని బ్రెజిల్‌ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొన్నది. అలాగే ఇంకా సుంకాల ప్రభావంలో ఉన్న ఉత్పత్తులపై చర్చలను ముందుకు తీసుకురావాలని బ్రెజిల్‌ కోరింది. ఇరు దేశాధ్యక్షుల మధ్య ఫోన్‌ సంభాషణ చాలా ఫలవంతంగా జరిగిందని పేర్కొన్నది. అంతర్జాతీయంగా వ్యవస్థీకృత నేరాలపై పోరాడటానికి అమెరికాతో సహకారం మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని లులా హైలెట్‌ చేసినట్టు బ్రెజిల్‌ వర్గాలు వివరించాయి. కరేబియన్‌లో పెద్ద స్థాయిలో సైనిక సన్నాహకాలు, వెనిజులా తీరంలో ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా దాడులు వంటి చర్యల నేపథ్యంలో ఈ రెండు దేశాధ్యక్షుల మధ్య ఫోన్‌ కాల్‌ ప్రాధాన్యతను సంతరించుకున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -