నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు చైర్మెన్‌గా నూతనంగా మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి, కోశాధికారిగా రావి ప్రతిభ నియమితులయ్యారు. ఆ ట్రస్టు చైర్మెన్‌గా ఉన్న సురవరం సుధాకర్‌రెడ్డి ఇటీవల మరణించిన విషయం విదితమే. బుధవారం హైదరాబాద్‌లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ఆ ట్రస్టు సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ట్రస్టు కార్యదర్శి కందిమల్ల ప్రతాప రెడ్డి రిపోర్టు ప్రవేశపెట్టారు. సీపీఐ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని డిసెంబర్ 26న రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో సభ జరుపుతామనీ, తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల ఫొటోలతో, పోరాట ఘట్టాలతో ఆడిటోరియంపై ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ నెలలో సెమినార్లు నిర్వహిస్తామని తెలిపారు. ఆ మూడింటి బాధ్యతలను బి.ప్రభాకర్, కాంతయ్య, ఎస్.వెంకటేశ్వర్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్‌కు అప్పగిస్తున్నామని పేర్కొన్నారు. ఆడిటోరియంలో లైబ్రరీ నిర్వహణ బాధ్యతలను కె.లక్ష్మణరావు చూసుకుంటారని తెలిపారు. సమావేశంలో చాడ, ప్రతిభతో పాటు సభ్యులు ఉజ్జిని రత్నాకర్ రావు, బొమ్మగాని ప్రభాకర్, కే శ్రీనివాస్ రెడ్డి, ఎస్ వెంకట్రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు చైర్మెన్‌గా చాడ వెంకట్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



