ముగ్గురు మృతి..
ఇద్దరికి తీవ్రగాయాలు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం వద్ద ఘటన
నవతెలంగాణ-సత్తుపల్లి
అతివేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టగా.. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలోని అంబేద్కర్‌నగర్ వద్ద రాష్ట్రీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుబల్లి మండలం వీఎం బంజర వైపునుంచి అతివేగంగా వచ్చిన కారు కిష్టారంలోని రాష్ట్రీయ రహదారి వద్ద అతివేగంతో డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురి ప్రాణాలు అక్కడికక్కడే మృతిచెందారు.
మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలించారు. మృతిచెందిన వారిలో చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామానికి చెందిన సాదిక్(21), సత్తుపల్లి మున్సిపాలిటీలోని కొమ్మేపల్లి కాలనీకి చెందిన సిద్దేసి జారు(21), ఆరో తరగతి చదువుతున్న మర్సకట్ల శశివర్దన్(12) ఉన్నారు. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లికి చెందిన తలారి అజరు, చండ్రుగొండ మండలం మహబాద్ కాలనీకి చెందిన ఎస్కే ఇమ్రాన్ తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిలో అజరు వెన్నుముఖ భాగం దెబ్బతిని పరిస్థితి విషమంగా మారింది. సత్తుపల్లి (కల్లూరు) ఏసీపీ వసుంధర యాదవ్ ఫారెబి, సీఐ తుమ్మలపల్లి శ్రీహరి, ఎస్‌ఐలు అశోక్, ప్రదీప్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కారు మొత్తం నుజ్జునుజ్జయి శకలాలు సుమారు 50మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా పడిపోయాయి. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ప్రమాద స్థలికి చేరుకొని ప్రమాదం గురించి తెలుసుకున్నారు.
డివైడర్‌ను ఢీ కొట్టిన కారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



