Thursday, December 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆటోలో రెండు మృతదేహాల కలకలం

ఆటోలో రెండు మృతదేహాల కలకలం

- Advertisement -

హైదరాబాద్‌ చాంద్రాయణగుట్టలో ఘటన
మాదకద్రవ్యాలు అధిక మోతాదులో తీసుకోవడంతోనే..!


నవతెలంగాణ-చాంద్రాయణగుట్ట
హైదరాబాద్‌ చాంద్రాయణగుట్టలో ఓ ఆటోలో రెండు మృతదేహాలు కనిపించడం బుధవారం కలకలంరేగింది. చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.గోపి వివరాల ప్రకారం చాంద్రాయణ గుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రోమన్‌ హౌటల్‌ ఎదుట ఆటోలో ఉంది. అందులో ఇద్దరు వ్యక్తులు స్పందనలేకుండా పడి ఉన్నారని స్థానికుల నుంచి సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. వారిద్దరూ విగతజీవులుగా ఉండగా.. మృతులను ఝంగీర్‌(24), ఇర్ఫాన్‌ (25)గా గుర్తించారు. క్లూస్‌ టీమ్‌ను పిలిపించి దర్యాప్తు ప్రారంభించారు. పక్కనే మూడు ఖాళీ సిరంజీలు లభించడంతో.. ఇద్దరు యువకులు ఇంజెక్షన్‌ ద్వారా మత్తు పదార్థాలు తీసుకున్నట్టు అనుమానం వ్యక్తమవుతోంది. మాదకద్రవ్యాలను అధిక మోతాదులో వినియోగించడం వల్ల మృతిచెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మూడు ఇంజెక్షన్‌ సిరంజీలు లభించడం వల్ల సంఘటనా స్థలంలో మొత్తం ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతుండటంతో మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -