Thursday, December 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవిచిత్ర వేషధారణలో వినూత్న ప్రచారం

విచిత్ర వేషధారణలో వినూత్న ప్రచారం

- Advertisement -

నవతెలంగాణ-కమలాపూర్‌
హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం నేరెళ్లలో సర్పంచ్‌ అభ్యర్థులు శ్రీరామ్‌, నాగలక్ష్మి వినూత్న ప్రచారం చేపట్టారు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. అభ్యర్థులు తమ అనుచరులతో ఎలుగుబంటి, చింపాంజీ వేషధారణ చేయించి గ్రామంలోని కోతులను తరిమేశారు. తమను గెలిపిస్తే కోతుల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని అభ్యర్థులు ఓటర్లకు హామీ ఇచ్చారు. గ్రామంలో 1537మంది ఓటర్లు ఉండగా, ఈ నెల 11న మొదటి విడత పోలింగ్‌ జరగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -