- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్-16సి ఫైటర్ జెట్ దక్షిణ కాలిఫోర్నియాలోని ఎడారిలో కూలింది. యుద్ధవిన్యాసాల ప్రదర్శనలకు పేరుగాంచిన ‘థండర్‌బడ్స్’ స్క్వాడ్రన్‌కు చెందిన ఈ విమానం ట్రోనా ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో నేలను ఢీకొట్టింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.45 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్ ప్రాణాలతో బయటపడగా, విమానం కూలిపోవడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగి, ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది.
- Advertisement -



