- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండ్రోజుల పర్యటనకు నేడు భారత్ రానున్నారు. రాత్రి 7గంటలకు ఢిల్లీ చేరుకొని PM మోడీ ఇచ్చే విందుకు హాజరుకానున్నారు. రేపు ఉదయం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత మోడీ-పుతిన్ మధ్య భేటీ జరగనుంది. పుతిన్ కోసం NSG కమాండోలు, స్నైపర్స్, డ్రోన్లు, AIతో ఐదంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. 2021 తర్వాత మళ్లీ ఆయన భారత్‌కు రావడం ఇదే.
- Advertisement -



