నవతెలంగాణ – హైదరాబాద్ : సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మృతిచెందాడని మనస్తాపంతో 18 ఏళ్ల ఆశని శ్రావణి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ పూర్తిచేసి కూలీ పనులకు వెళ్తున్న శ్రావణికి, దౌల్తాబాద్ మండలం మల్లేశంపల్లికి చెందిన కుమ్మరి మహేష్ అలియాస్ రసీం బాబాతో పరిచయం ఏర్పడింది. ఇటీవల మహేష్ మృతిచెందడంతో మనస్తాపానికి గురైన శ్రావణి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే శ్రావణి మృతి చెందిందని వైద్యులు తెలిపారు. తండ్రి శంకర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
ప్రియుడి మృతి తట్టుకోలేక యువతి బలవన్మరణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



