Thursday, December 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలురైలు ఢీకొని ఇద్దరు మృతి

రైలు ఢీకొని ఇద్దరు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కలికిరి రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్‌పై ఇద్దరు వ్యక్తులు మద్యం సేవిస్తుండగా.. స్టేషన్ సిబ్బంది వారించారు. ఆ ఇద్దరు వ్యక్తులు, స్టేషన్ సిబ్బందితో గొడవపడి, రైల్వే పట్టాలపై కూర్చొని మద్యం తాగారు. అదే సమయంలో వచ్చిన ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొనడంతో వారిద్దరూ మృతి చెందారు. మృతుల్లో ఒకరు చిత్తూరు జిల్లా సోమల మండలం ఇరికి పెంటకు చెందిన గంధం ముని కుమార్, మరొకరు అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి క్రాస్ రోడ్డుకు చెందిన జి వీరభద్రయ్య బాబుగా గుర్తించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -