నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చింది. కాలుష్యాన్ని నియంత్రించాలని విపక్ష సభ్యులు ఇవాళ పార్లమెంట్‌లో డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆవరణలో మాస్క్‌లు ధరించిన ఎంపీలు నిరసన చేపట్టారు. సోనియా గాంధీతో పాటు అనేక మంది విపక్ష ఎంపీలు మాస్క్‌లు ధరించి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించే చర్యలు తీసుకోవాలని, ఇది ప్రభుత్వ బాధ్యత అని, కాలుష్యంతో పిల్లలు చనిపోతున్నారన్నారు.
నాలాంటి వయసు మీరిన వాళ్లు కూడా కాలుస్యంతో ఇబ్బందిపడుతున్నారని సోనియా పేర్కొన్నారు. వాయు కాలుష్యం రాజకీయ అంశం కాదు అని ప్రియాంకా గాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే కాలుష్యాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలన్నారు. వాయు కాలుష్యంపై చర్చించాలని ఉభయసభల్లో కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది.



