ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ప్రత్యేక సెక్షన్లు
నవతెలంగాణ – మల్హర్ రావు
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా బీఎన్ఎస్-163(144 సీఆర్పీసీ యాక్ట్) అమలు చేస్తారు. నలుగురి కన్నా ఎక్కువ మంది ఒక చోట ఉండకూడదు. అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు, ప్రచారం నిర్వహించకూడదు. కర్రలు ఇతర మారణాయుధాలతో తిరగ కూడదు. పోలింగ్ కు 48గంటల ముందు ప్రచారం చేసిన కోడ్ ఉల్లంఘన కింద పరిగణిస్తారు.
అన్ని రకాల సోషల్ మీడియా (సామాజిక మాధ్యమాల్లో) ప్రత్యర్థులను విమర్శిస్తూ పోస్టులు పెట్టడంపై ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తారు. మద్యం అమ్మకాలపై ఆంక్షలుంటాయి. బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసినా, అక్రమంగా నిల్వ ఉంచినా, ఓటర్లకు పంచుతూ పట్టుబడిన కేసు నమోదు చేస్తారు. అలాగే 34ఏ ఎక్సైజ్ చట్టం 1968 కింద జరిమానా, శిక్ష విధిస్తారు. ప్రస్తుతం కొత్తగా వచ్చిన చట్టంలో బీఎన్ఎస్ 169 నుంచి 177 సెక్షన్ వరకు ఎన్నికల నియామవళి కింద కేసులు నమోదు చేస్తారు. దీంతో పంచాయతీరాజ్ చట్టం- 2018లోని సెక్షన్ 212 నుంచి 219 ప్రకారం కేసుల నమోదుకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.



