Thursday, December 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉద్యోగం వదిలి.... ప్రజాసేవకు కదిలి

ఉద్యోగం వదిలి…. ప్రజాసేవకు కదిలి

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
స్థానిక సంస్థల ఎన్నికలవేళ పల్లె రాజకీయాల ముఖచిత్రం మారుతుంది. సర్పంచ్ గా పోటీ చేసేందుకు యువత, ఉద్యోగులు, విద్యావంతులు బరిలోకి దిగేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. మండల పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన కుంచాల శ్రీనివాస్ రెడ్డి తన గ్రామ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో , ఊరిమీద ప్రేమతో గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు. అందుకు నిబంధనల ప్రకారం అడ్డు వస్తుందని తన గోపాలమిత్ర పదవికి సైతం రాజీనామా చేసి సర్పంచ్ బరిలో పోటీలో ఉన్నారు.

గతంలో కూడా గ్రామ అభివృద్ధి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ వైపల్యాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలతో పాటు తులం బంగారం, రైతుబంధు, యువతులకు స్కూటీలు అందించకుండా దగా చేసిందని గుర్తుచేశారు. రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని యూరియా కోసం రైతులు నిద్రాహరాలు మాని షాపుల ఎదుట పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల్లోనే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత సిపిఎం, బిజెపిల మద్దతు గ్రామ ప్రజల అండదండలు తనకు కలిసి వచ్చే అవకాశంగా భావిస్తున్నారు. పార్టీలకు అతీతంగా కలుపుకుపోయే మనస్తత్వం గల వ్యక్తిగా కొనసాగుతున్న శ్రీనివాస్ రెడ్డి గెలుపు ఖాయమని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -