Thursday, December 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులదే గెలుపు..

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులదే గెలుపు..

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలు,సంక్షేమ పథకాల పట్ల, ప్రజలు సంతోషంగా ఉన్నారని, మండల పరిధిలోని అన్నారం (గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు) సర్పంచ్ అభ్యర్థి కుంచాల ప్రవీణ్ రెడ్డి అన్నారు. గురువారం ఇంటింటి ప్రచారంలో భాగంగా పదేళ్ల బిఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ప్రజా ప్రభుత్వం రెండేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నారం గ్రామానికి 60 లక్షల రూపాయలతో సిసి రోడ్లు,12 లక్షలతో అంగన్వాడి భవనం, 40 మందికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, 190 కొత్త రేషన్ కార్డుల పంపిణీ, 100 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. గ్రామంలోని ప్రజలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కుంచాల ప్రవీణ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని ప్రజా పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనని గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -