– ఎఐపిసి సభ్యులు…
నవతెలంగాణ – బంజారాహిల్స్
రైతులతో పాటు మహిళాసాధికారతకు అలాగే యువతకు సంబంధించిన విద్య,ఉద్యోగ,ఆరోగ్య, క్రీడా అభివృద్ధికి ఆల్ ఇండియా ప్రొఫెసనల్స్ కాంగ్రెస్ (ఎఐపిసి) పనిచేస్తున్నదని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆదిత్య రెడ్డి తెలిపారు. ఈ మేరకు హైద్రాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆలిండియా ప్రొఫెసనల్స్ కాంగ్రెస్ మెంబర్షిప్ డ్రైవ్ కు సంబంధించిన బ్రోచర్ ను వివిధ సంస్థల నిపుణులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ… వ్యాపారావకాశాలపై ఆసక్తి ఉన్నవారికి తాము మంచి ప్లాట్ ఫామ్ నుండి అందిస్తామన్నారు. అగ్రికల్చర్, ఐటి, స్పోర్ట్స్, పరిశోధన, హెల్త్ , ఆర్కిటెక్ట్, ఫొటోగ్రఫీ, చార్టర్డ్ ఆకౌంట్ వంటి రంగాలపై అవగాహన కల్పించి వారి అభివృద్ధికి సహకరిస్తామన్నారు. ప్రజల అభివృద్ధికి చేసే ప్రభుత్వ కార్యక్రమాలపై భాగస్వామ్యవుతామన్నారు.ఆసక్తి ఉన్న యువతతో పాటు విద్యావంతులు ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్లో ప్రవేశం పొందేందుకు httge ://jcn.profcongres.in/joinలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు రంగాల నిపుణులు భరత్రెడ్డి, సంతోష్, సందీష్, సిఎం సుబ్బారావు, కవితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



