Thursday, December 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయుల సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించిన ఎంపీ చామల

ఉపాధ్యాయుల సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించిన ఎంపీ చామల

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పార్లమెంటు సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు. ఎస్ టి ఎఫ్ ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  ఆదిమూలం వెంకట్, యాదాద్రి భువనగిరి జిల్లా యుటిఎఫ్ అధ్యక్షులు యాదాద్రి భువనగిరి  ముక్కెర్ల యాదయ్య అందించిన రిప్రెజెంటేషన్ ఆధారంగా పార్లమెంట్ సమావేశంలో ఉపాధ్యాయుల సమస్యలను సభలో ప్రస్తావించినట్లు తెలిపారు.

లోక్ సభ లో ఆయన మాట్లాడుతూ.. 2010 ఆగస్టు 23కి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు అకస్మాత్తుగా టెట్ పరీక్షను తప్పనిసరి చేయడం వల్ల లక్షలాది ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గతంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక మార్లు స్పష్టం చేసినట్లు ఆ తేదీకి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ వర్తించదని చెప్పడం వల్ల చాలా మంది ఉపాధ్యాయులు ఈ పరీక్షకు హాజరు కాలేదని ఇప్పుడు వారికి రెండు సంవత్సరాల లోపు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేయడం పూర్తిగా అన్యాయం, వారి ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని, వేలాది సీనియర్ ఉపాధ్యాయుల భవిష్యత్ సంక్షోభంలో పడుతుందని సభ ద్రుష్టి కి తీసుకువచ్చారు.

కేంద్ర ప్రభుత్వం నియమితులైన ఉపాధ్యాయుల హక్కులను రక్షించడానికి తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఆర్టిఐ యాక్ట్ ఆర్టిఈ యాక్ట్  2009, ఎం సి టి ఈ యాక్ట్ 1993 లలో తగిన సవరణలు చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -