ఎన్నికలను బహిష్కరించిన పేరూరు
రిజర్వేషన్ తో దాఖలు కాని నామినేషన్లు
నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని రెండు గ్రామపంచాయతీల్లో సర్పంచ్లకు, 26 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అభంగాపురంలో ఎస్టీ రిజర్వ్ కావడంతో ఆ గ్రామంలో ఓటర్లు లేకపోవడంతో సర్పంచ్ పదవికి ఎవరూ నామినేషన్ వేయలేదు. అనుముల మండలంలోని పేరూరు గ్రామం ఎస్టీ మహిళా రిజర్వ్ కావడంతో ఆ గ్రామంలో ఎస్టీ ఓటర్లు ఎవరూ లేకపోవడంతో సర్పంచ్ పదవితోపాటు గ్రామంలో ఉన్న పది వార్డులకు నామినేషన్ వేయకుండా గ్రామస్తులు బహిష్కరించారు. రిజర్వేషన్ మార్పు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన పలితం లేకపోవడంతో గ్రామస్తులు ఏకతాటిగా ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు వార్డు సభ్యులకు కూడా నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతోపాటు మాడ్గులపల్లి మండలంలోని 11వార్డులకు, నిడమనూరు మండలంలో రెండు వార్డులకు, తిరుమలగిరి (సాగర్) మండలంలో మూడు వార్డులకు రిజర్వేషన్ కారణంగా నామినేషన్ దాఖలు కాలేదు. దీంతో ఆ రెండు గ్రామాలతోపాటు ఆయా వార్డుల్లో ఎన్నికలు జరగడం లేదు.
ఆ ఓటర్లకు ఎన్నికలు లేవు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


