- Advertisement -
రిజెక్ట్ కు బదులు అనుమతి
ఆందోళన చేసిన కాంగ్రెస్ నాయకులు
నవతెలంగాణ – మిర్యాలగూడ
నామినేషన్ పత్రాలను అధికారులు దిద్దుబాటు చేశారని కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేసిన సంఘటన బుధవారం దామరచర్ల మండలం లో చోటుచేసుకుంది. వివరాలు వెళితే దామరచర్ల మండలంలోని రాళ్ళవాగు తండా కు సర్పంచ్ పదవి కోసం బి ఆర్ ఎస్ బలపర్చిన అభ్యర్ధి తన నామినేషన్ పత్రాలలో సంతకాలు చేయలేదని, తేదీ వేయలేదని తెలియడంతో కొండ్రపోల్ క్లస్టర్ల లో ఉన్న అధికారులు ఆ నామినేషన్ పత్రాలలో దిద్దుబాటు చేశారని కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్ధి దీరవత్ శంకర్ ఆరోపిస్తూ క్లస్టర్ వద్ద ఆందోళన చేయగా పోలీసులు వచ్చి నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు.
- Advertisement -



