Thursday, December 4, 2025
E-PAPER
Homeఆదిలాబాద్స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే ధ్యేయం

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే ధ్యేయం

- Advertisement -

ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్..
నవతెలంగాణ – జన్నారం
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని డీసీసీ నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. జన్నారం మండల కేంద్రంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ మాజీ సర్పంచ్ వొజ్జల లచ్చన్న,గ్రామ నాయకులు చేటుపల్లి లచ్చన్న, గాజుల రమేష్, గడ్డం మల్లయ్య, మడ్ల శేఖర్, కటకం సత్తన, హస్తం పార్టీలో చేరగా వెడ్మ బొజ్జు పటేల్  కండువాలు కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -