నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్ గా పనిచేసిన కొణిజేటి రోశయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కొణిజేటి రోశయ్య వర్ధంతి కార్యక్రమానికి రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, అధికారులతో కలిసి హాజరై రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా ఎన్నో సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసి రాష్ట్రాన్ని వినూత్న సంస్కరణలతో అభివృద్ధి చేశారని తెలిపారు. మహనీయుల ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి జయమ్మ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యామ్ సుందర్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జగన్మోహన్ ప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
మాజీ సీఎం రోశయ్య సేవలు చిరస్మరణీయం: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



