Thursday, December 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టంగుటూరును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

టంగుటూరును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

- Advertisement -

సీపీఐ(ఎం) మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు : జూకంటి అనిల్ కుమార్
నవతెలంగాణ – ఆలేరు రూరల్ 

టంగుటూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నియోజకవర్గంలో తీర్చిదిద్దేందుకు శక్తి వంచన లేకుండా పట్టుదలతో కృషి చేస్తానని బి ఆర్ ఎస్ పార్టీ తరఫునుండి సర్పంచ్ బరిలో ఉన్న జూకంటి అనిల్ కుమార్ అన్నారు. గురువారం ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వ సహకారంతో గ్రామంలో సిసి రోడ్లు వేయించడంతో పాటు అనారోగ్యానికి గురి అయిన 200 మందికి వైద్య ఖర్చుల కింద ప్రభుత్వం నుండి సీ ఎం ఆర్ ఎఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం ఇప్పిచ్చానని చెప్పారు. సొంత నిధులతో గ్రామంలో కోతుల బెడదను తొలగించేందుకు కోతులు పట్టే వారిని  పిలిపించి కోతులను మేడారం అడవి ప్రాంతాలకు తరలించా అని చెప్పారు. అనారోగ్యానికి గురి అయిన పేదలకు తన వంతు సహకారం ఈ ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్కరికి శక్తి కొలది అందించ అని చెప్పారు.మరణించిన కుటుంబాలు కు ఆర్థిక సాకారాన్ని ఇస్తూ టంగుటూరు కళ్లెం రోడ్డు మరమ్మతుకు 50,000 సొంతంగా ఇచ్చాను అని చెప్పారు.

మహిళా సోదరీమణుల కోసం కోసం బతకమ్మ పండగ సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించి రెండు లక్షల రూపాయలు ఖర్చు చేశానన్నారు.గ్రామంలో జరిగిన చెల్లెళ్ల పెళ్లిళ్ల కళ్యాణ లక్ష్మి చెక్కులను వెంటవెంటనే ఇప్పించానన్నారు. తన గెలుపు కోరుతూ సి పి ఐ ఎం పార్టీ తనకు మద్దతు ఇవ్వడం పట్ల అపార్టీ నాయకుడు దాసి శంకర్ తో పార్టీ సభ్యులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనకు  ఉంగరం గుర్తుని ఎన్నికల అధికారులు కేటాయించినట్లు చెప్పారు. ఉంగరం గుర్తుపై ఓటేసి తనని గెలిపించినట్లయితే గ్రామ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా నీతి నిజాయితీతో అందరినీ కలుపుకొని పార్టీలకతీతంగా పనిచేస్తానని తెలిపారు. టంగుటూరులో ప్రచారంలో సి పి ఐ ఎం పార్టీ,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు ఎలగందుల వెంకటేశ్వర్లు,నీల రామన్న,ఏసు రుషి,కందాల మల్లేష్, భూపెళ్లి కేశవులు,అందె రాములు, బండి రమేష్,జాలపు లక్ష్మి,కుంభం సోమిరెడ్డి,ఆలేటి రాంరెడ్డి,కళ్లెపు నరేష్,కావడి మహేందర్,చీర లింగం, జూకంటి బాబు గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -