Thursday, December 4, 2025
E-PAPER
Homeజాతీయంరూపాయి ప‌త‌నం..బీజేపీపై కాంగ్రెస్ తీవ్ర విమ‌ర్శ‌లు

రూపాయి ప‌త‌నం..బీజేపీపై కాంగ్రెస్ తీవ్ర విమ‌ర్శ‌లు

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: రూపాయి విలువ దిగజారింది. డాలర్‌తో పోలిస్తే మన రూపాయి విలువ 90కి పడిపోయింది. గురువారం ఉదయం ఆల్‌ టైమ్‌ కనిష్టస్థాయి 90.43కి చేరింది. ఈ నేపథ్యంలో కేంద్రం అవలంబిస్తున్న ఆర్థిక విధానాల వల్లే రూపాయి పతనమవుతుందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా విమర్శించారు. గురువారం ఆయన పార్లమెంటు వెలుపల ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్ర అవలంబిస్తున్న విధానాల వల్లే రూపాయి పతనమైంది. భారత కరెన్సీకి ప్రపంచంలో విలువ లేదు. వారి విధానాల వల్లే రూపాయి బలహీనపడుతోంది. వారి విధానం బాగుంటే రూపాయి విలువ పెరిగి ఉండేది. రూపాయి పతనం.. మన ఆర్థిక వ్యవస్థ బాగోలేదని చూపిస్తుంది. మనం ఏది కావాలంటే అది చెప్పగలం. మనల్ని మనం అభినందించుకోవచ్చు. కానీ మన కరెన్సీకి ప్రపంచంలో విలువ లేదని చూపిస్తుంది’ అని ఆయన అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -