నవతెలంగాణ-వనపర్తి: ఖిల్లా ఘనపురం మండలంలోని పలువురు బాధితుల కుటుంబాలను వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గురువారం వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ఖిల్లా ఘణపురం మండల పరిధిలోని మామిడిమాడ గ్రామంలో పలువురి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల పొలం వద్ద ప్రమాదవశత్తు జారి పడడంతో తుంటిలో విరిగిపోయి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న బోయ డేగలి బుచ్చన్న కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. బుచ్చన్న తో మాట్లాడి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. నాలుగు రోజుల క్రితం మృతి చెందిన జాన్మీయా కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. జాన్మియా మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన భారతి కుటుంబాన్ని సైతం ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ సందర్భంగా భారతి మృతికి కారణాలను భర్త గోపాల్ తో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆ గ్రామస్తులతో మాట్లాడి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్రావు, సాయి చరణ్ రెడ్డి, లింగం, నరసింహారెడ్డి, దానయ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




