Thursday, December 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు..

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు..

- Advertisement -

వార్డు మెంబర్ తో సహా సర్పంచును గెలిపించండి
గ్రామ అభివృద్ధికి అన్ని రకాలుగా అండగా ఉంటా ఎమ్మెల్యే హామీ
నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో వార్డు మెంబర్లతో సహా సర్పంచును గెలిపించండి గ్రామ అభివృద్ధికి అన్ని రకాలుగా అండగా ఉంటానని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు హామీ ఇచ్చారు. మద్నూర్ మండల కేంద్రంలోని 9వ వార్డులో ఎమ్మెల్యే సమక్షంలో ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. తొమ్మిదో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సందుర్వార్ అశోక్ తో పాటు సర్పంచ్ కు భారీ మెజారిటీ అందించాలని ఎమ్మెల్యే వార్డు ప్రజలను గ్రామస్తులను కోరారు. చేరికల అనంతరం ఎమ్మెల్యేకు 9వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసే అశోక్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ చేరికల కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉష సంతోష్ మేస్త్రి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు నూతనంగా ఎన్నికైన గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు బండి గోపి పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -