Thursday, December 4, 2025
E-PAPER
Homeనిజామాబాద్విజిలెన్స్ అధికారులతో విచారణ జరపాలి..మున్సిపల్ కార్యాలయం ఎదుట‌ ఆందోళన

విజిలెన్స్ అధికారులతో విచారణ జరపాలి..మున్సిపల్ కార్యాలయం ఎదుట‌ ఆందోళన

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్: పట్టణ మున్సిపల్ కార్యాలయంలో 2014 సంవత్సరం నుండి జరిగిన అవినీతిపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలని మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, మాజీ ఫ్లోర్ లీడర్ జీవి నర్సింహారెడ్డి లో డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో గురువారం జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్, మున్సిపల్ ప్రత్యేక అధికారులకు వినతి పత్రం అందజేశారు. ప్రత్యేక అధికారి చాంబర్ ఎదుట బైఠాయించి అవినీతిపై విచారణ చేపట్టాలని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై ఎన్నిసార్లు కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన పట్టించుకోకపోవడంతోనే అవినీతి మితిమీరి పోతుందన్నారు. అక్రమ కట్టడాలు, అక్రమ ఇంటి నెంబర్లతో పాటు మున్సిపల్ అక్రమాల పైన ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి అవినీతిపై విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్, బి ఆర్ ఎస్ నాయకులు దొందు దొందే అని ఇద్దరు తోడు దొంగలే అన్నారు .ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వేణు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -