నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ఈ రెండేళ్ల కాలంలో_ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, అర్హులైన ప్రతీ ఒక్కరికీ పార్టీలకతీతంగా ఎటువంటి పక్షపాతం చూపకుండా సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేశానని చెప్పారు.
గత పదిహేనేళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన హన్మంత్ షిండే నియోజకవర్గాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. డోంగ్లీ మండల కేంద్రానికి తాను ఇప్పటి వరకు సీసీ రోడ్ల కోసం రూ. 70 లక్షల నిధులు మంజూరు చేయించడం జరిగిందని చెప్పారు.భవిష్యత్ లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే డోంగ్లి గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల్లో అభివృద్ధి పనులు మరింత వేగంగా జరిగి, ప్రజలకు అవసరమైన సేవలు, సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.



