Thursday, December 4, 2025
E-PAPER
Homeనల్లగొండపల్లెపోరు రసవత్తరం

పల్లెపోరు రసవత్తరం

- Advertisement -

నవతెలంగాణ-కట్టంగూర్: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత లో మండలంలో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల పర్వం పూర్తయి అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు జరగడంతో గ్రామాలలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మండలంలో 22 గ్రామపంచాయతీలు, 206 వార్డు స్థానాలు ఉండగా వాటిలో రెండు గ్రామపంచాయతీలు మల్లారం, దుగిన్నెల్లి గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యాయి.

దీంతోపాటు పలు గ్రామాలలోని 16 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మండలంలో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొంది. కాగా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఎక్కువ అవడంతో రెబల్స్ అభ్యర్థులు భారీగా పోటీలో ఉన్నారు. 20 గ్రామాలలో 76 మంది అభ్యర్థులు సర్పంచ్ లు గా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో పాత కొత్త నాయకుల మధ్య సయోధ్య లేకపోవడంతో రెండు వర్గాలుగా చీలిపోయారు.

టికెట్ల కేటాయింపులు ఎమ్మెల్యే వర్గం ఏకపక్షంగా వ్యవహరించడంతో పాత కాంగ్రెస్ నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో అన్ని గ్రామాలలో పోటీ చేస్తామని ప్రకటించారు.14 గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రెబల్ అభ్యర్థులతో పోటీ పడనున్నారు.

మండల కేంద్రమైన కట్టంగూర్ లో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి కి, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థికి పోటి జరగనుంది. కాగా రెబల్ అభ్యర్థికి స్థానిక బిఆర్ఎస్ నాయకులు, బిజెపి నాయకులు మద్దతు తెలిపారు. ఐటిపాముల గ్రామంలో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉండగా కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి అభ్యర్థులు మధ్య పోరు జరగనుంది. ఈదులూరు గ్రామంలో ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉండగా కాంగ్రెస్, బిఆర్ఎస్ ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది.

చెరువు అన్నారం గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థితో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పోటీ పడనున్నారు. కాగా రెబల్ అభ్యర్థికి బిఆర్ఎస్ తో పాటు పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. బోల్లేపల్లి గ్రామంలో ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉండగా కాంగ్రెస్ అభ్యర్థికి, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థికి తీవ్ర పోటీ ఉండనుంది. . పిట్టంపల్లి గ్రామంలో ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉండగా కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి, బిఆర్ఎస్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇస్మాయిల్ పల్లి గ్రామంలో ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉండగా కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరు, బిఆర్ఎస్ పార్టీ నుండి ఇద్దరు, సిపిఎం పార్టీ నుండి ఒకరు పోటీ పడుతున్నారు.

కలిమెర గ్రామంలో ముగ్గురు అభ్యర్థులు ఉండగా పోటీ ప్రధానంగా కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థికి పోటి ఉండనుంది. పరడా గ్రామంలో ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉండగా కాంగ్రెస్ నుండి ఇద్దరు అభ్యర్థులు, బిఆర్ఎస్ నుండి ఒకరు, బిజెపి నుండి ఒకరు సిపిఎం నుండి ఒకరు పోటీలో ఉన్నారు. ఎరసానిగూడెం గ్రామంలో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉండగా కాంగ్రెస్ నుండి ముగ్గురు బిఆర్ఎస్ నుండి ఒకరు పోటీ పడనున్నారు.

నల్లగుంటపోలు గ్రామంలో నలుగురు అభ్యర్థులు బరిలో ఉండగా కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థుల మధ్య పోటీ జరగనుంది. నారగూడెం గ్రామంలో ఆరుగురు బరిలో ఉండగా కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులతో పాటు మరో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

పందెనపల్లి గ్రామంలో కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి, బిఆర్ఎస్ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది రామచంద్రపురం గ్రామంలో నలుగురు అభ్యర్థులు బరిలో ఉండగా కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్, బిఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. భాస్కర్లబాయి గ్రామంలో కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్, బిఆర్ఎస్ అభ్యర్థుల మధ్య పోటీ జరగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -