- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యార్ధులలో పుస్తక పఠనం అలవర్చి, గ్రంధాలయ పుస్తకాల వినియోగం పట్ల ఆసక్తిని పెంపొందించాలని, విద్యార్ధుల సామర్ధ్యాలను పెంచాలని ఎంఈఓ ప్రసాదరావు అన్నారు. గురువారం అశ్వారావుపేట, నెహ్రూ నగర్ పాఠశాలలు ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్ధుల సామర్ధ్యాలను ,పరిశీలించారు.వ్రాత పుస్తకాలు,వ్రాసిన పుస్తకాలను పరిశీలించి విద్యార్ధుల సామర్ధ్యాల పై సంతృప్తి వ్యక్తం చేశారు. తేదీ వారీగా వర్కు బుక్స్ ను వినియోగిస్తే 1,2 తరగతులలో మంచి ఫలితాలను సాధించవచ్చునని అన్నారు. కనీస సాధనా సామర్ధ్యాల పై ఫిబ్రవరి నెలలో ప్రత్యేక సర్వే ఉంటుందని దానికి విద్యార్ధులను సిద్ధం చేయాలని అన్నారు. ఆయన వెంట సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు ఉన్నారు.
- Advertisement -



