Thursday, December 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఖరీఫ్ సీజన్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అదనపు కలెక్టర్

ఖరీఫ్ సీజన్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అదనపు కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ఖరీఫ్ 2025-26 సీజన్ విషయమై గురువారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరు (పౌరసరఫరాలు) పౌరసరఫరాల కమిషనరు వారిచే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతుల వద్ద నుండి సేకరించిన ధాన్యంకు వెంటనే ఓ పి ఎమ్ ఎస్ యందు ట్యాబ్ ఎంట్రీ చేయించి,మిల్లర్  అక్నౌలెడ్జిమెంట్  ఇప్పించవలసినదిగా కోరారు. రైతులకు ఎటువంటి జాప్యం లేకుండా చెల్లింపులు చేయుటకు అవకాశం ఉంటుందని, రబీ 2024-25 సీఎంఆర్   డెలివరీ విషయమై రోజువారీ టార్గెట్ ఏర్పాటు చేసుకుని, మిల్లుల వద్దనుండి సి ఎం ఆర్ పొందువిధముగా చర్యలు తీసుకోవలసినదిగా ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారులు హరికృష్ణ, రోజారాణి, డిఆర్డిఓ నాగిరెడ్డి,  సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -