Thursday, December 4, 2025
E-PAPER
Homeక్రైమ్కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – మునిపల్లి
బావిలో దూకి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మేళసంఘం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మునిపల్లి మండలం మేళసంఘం గ్రామానికి చెందిన పెద్ద గొల్ల రాములు (28) అనే వ్యక్తి జహిరాబాద్ పట్టణం బాబా నగర్ కు చెందిన మాధవిని గత ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నాడు. అయితే వారి మధ్య ఏం జరిగింధో ఏమో కాని రెండు నెలల క్రితం ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పందం కుదుర్చుకొని మాధవి పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో మనస్థాపానికి గురైన రాములు బుధవారం సాయంత్రం గ్రామ శివారులో గల తన సొంత పొలం వద్ద ఉన్న బావిలో దూకి మృతి చెందాడు. మృతుని తండ్రి నర్సిములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజేష్ నాయక్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -