Thursday, December 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై అవగాహన..

అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై అవగాహన..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
యాదాద్రి భువనగిరి జిల్లాలోని మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల లో బాగంగా బొమ్మలరామారం, ఆలేరు, ఆత్మకూరు, రాజాపేట , తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో పూర్తి చేయి అభ్యర్థుల ఎన్నికల వ్యయం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎన్నికల వయ్య  పరిశీలకులు ఎం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు.   ఎన్నికల ప్రచార ఖర్చులను, పోటీ చేసే అభ్యర్థులు పకడ్బందీగా  స్పష్టంగా నమోదు చేయాలన్నారు.

ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అభ్యర్థులు , లేదా వారి ప్రతినిధులు పూర్తి ఖర్చుల రికార్డులతో వ్యయ పరిశీలనకులనకు  తప్పనిసరిగా హాజరు కావాల్సింది ఉంటుందన్నారు. 5 వేలకు పైగా జనాభా గల గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గరిష్ట వ్యయ పరిమితి రెండు లక్షల 50 వేలు, వార్డు మెంబర్ కు  50  వేలు వ్యయ పరిమితి గలదని అలాగే 50 వేల లోపు జనాభా గల గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గరిష్ట వ్యయ పరిమితి 1.50 లక్షలు, వార్డు మెంబర్ కు 30 వేలు మాత్రమేనని తెలిపారు.

పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచార నిమిత్తం ఉపయోగించే వాహనాలను స్థానిక తహసిల్దార్/ రిటర్నింగ్ అధికారి దగ్గర తప్పనిసరిగా అనుమతి పొందాలని అనుమతి లేకుండా వినియోగించినట్లయితే ఎన్నికల  నియమా నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికలలో రోజువారి చేసిన ప్రచార ఖర్చులకు సంబంధించి ప్రతి పైసాను తమ ఖర్చుల ఖాతాలలో చూపించాలన్నారు. మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న మండలాలకు (బొమ్మలరామారం, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, ఆలేరు, ఆత్మకూర్, రాజాపేట)  రైతు కు సంబంధించి డిసెంబర్ 6న మొదటి విడత, డిసెంబర్ 8న రెండో విడతగా రెండుసార్లు అభ్యర్థుల ఖర్చుల లెక్కలను పరిశీలిస్తారన్నారు.

ఆయా లెక్కలన్నీ సంబంధిత మండల పరిషత్ అధికారి కార్యాలయంలో ఉదయం 10:00 నుండి 5 గంటల మధ్య పరిశీలిస్తారన్నారు. అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు ఎన్నికల కాక నిర్వహణ రిజిస్టర్ సంబంధిత డాక్యుమెంట్లో పరిశీలకుల ముందు ఆయా తేదీలలో తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. ఎన్నికల వ్యయ పరిశీలనకు హాజరుకాని అభ్యర్థికి  నోటీసులు జారీ చేస్తామని, నోటీసులకు సరైన సంజయిష్ లేనట్లయితే ఎన్నికల నియమా నిబంధన మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి , ఓడిపోయిన అభ్యర్థి ఎన్నికల ఫలితాల తరువాత 45 రోజుల్లో తుది వివరాలు తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు.  పోటీ చేయు అభ్యర్థి ప్రచార సమయంలో తమ వద్ద రూ.1000/  కంటే ఎక్కువ సరైన  ఆధారాలు లేకుండా ఉండడానికి వీలు లేదన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -