నవతెలంగాణ-బోడుప్పల్: స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంలో అన్ని రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని ఆవేదనతో.. సాయి అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సాయి యువకుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయానికి గురువారం సాయంత్రం వచ్చాడని, మల్లన్నను కలవాలని సిబ్బందికి తెలియజేశాడు. ప్రస్తుతం మల్లన్న అందుబాటులో లేడని, రేపు ఉదయం రావాలని చెప్పి పంపించారు. దీంతో కిందకు వచ్చిన సదరు యువకుడు క్యూ న్యూస్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పుంటించుకున్నాడు. వెంటనే స్థానికులు మంటలు అర్పేందుకు యత్నించడంతో పాటు ఫైర్ ఇంజన్, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. తక్షణమే గాయపడిన యువకుని గాంధీ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మల్లన్న యువకుడిని పరామర్శించేందుకు గాంధీ ఆస్పత్రికి వెళ్ళి, ఆత్మహత్య యత్నానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.
తీన్మార్ మల్లన్న కార్యాలయం ఎదుట యువకుడు ఆత్మహత్య యత్నం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



