నవతెలంగాణ – ఆలేరు టౌను
కృషి పట్టుదలతో విద్యార్థుల విద్యపై పాటు సాధించాలని, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు విద్యార్థులకు సూచించారు. ఆలేరు పట్టణంలో గురువారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ ను పర్యవేక్షించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులతో కలిసి మాట్లాడారు. విద్యార్థులకు విద్య ఇతర అంశాల గురించి వివరించారు.
ఉత్తీర్ణత శాతం నూటికి నూరు శాతం తీసుకొని రావాలని, విద్య పై పట్టు సాధించడం ద్వారానే, మీ జీవితాల్లో వెలుగును మేము చవి చూడాలని విద్యార్థులకు తెలియజేశారు. ఆహార విషయాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దారు, వి.ఆంజనేయులు, ఆర్ ఐ పూర్ణచందర్రావు, జోనల్ ఆఫీసర్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



