Thursday, December 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధి చేసి చూపిస్తా.. ఆశీర్వదించండి

అభివృద్ధి చేసి చూపిస్తా.. ఆశీర్వదించండి

- Advertisement -

స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి కర్రే వీరయ్య 
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 

మల్లాపురం గ్రామ ప్రజలు అందరూ గ్రామపంచాయతీ ఎన్నికలలో ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తానని స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి కర్రే వీరయ్య అన్నారు. గురువారం, యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలోని వీధుల్లో ఇంటింటికి తిరుగుతూ గ్రామ నాయకులు కార్యకర్తలతో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఆపదలో ఆదుకుంటూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ సమస్యలను పరిష్కారం చేస్తానని అన్నారు. గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దోళ్ల ఐలయ్య,  ఒగ్గు జంగయ్య, కర్రే గణేష్, కర్రె రాములు, శిఖ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -