Thursday, December 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలున‌ల్గొండ బత్తాయి రైతుకు అరుదైన గౌరవం

న‌ల్గొండ బత్తాయి రైతుకు అరుదైన గౌరవం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-నల్గొండ: మాడుగులపల్లి మండలం అవంగపురం గ్రామానికి చెందిన బత్తాయి రైతు కే.చంద్రారెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ది ఏషియన్ పి జి పి ఆర్ సొసైటీ మహా కిసాన్ మేళా డిసెంబర్ 3, 4 తేదీలలో.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల్ కన్హా శాంతి వనం కేంద్రంగా అవార్డు ప్ర‌దానోత్స‌వం నిర్వ‌హించారు. ఈ సంద్భంగా ఆసియన్ పీజీపీర్ సొసైటీ చైర్మన్ ప్రొఫెసర్ ఎమ్మెస్ రెడ్డి, తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి చేతుల మీదుగా ఆదర్శ రైతు అవార్డును అన్న‌దాత‌ కే చంద్ర రెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు రైతుని గుర్తించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. కానీ రైతు పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర వచ్చిన రోజే సరైన గుర్తింపు అని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ డి రాజిరెడ్డి విసి ఉద్యాన విశ్వవిద్యాలయం తెలంగాణ, డాక్టర్ రాజారెడ్డి డీన్ మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ డాక్టర్ కే గోపాల్ విసి డాక్టర్ వైయస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -