– సర్పంచ్ స్థానాలకు 35, వార్డు స్థానాలకు 138
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలో గురువారం నాటికి 138 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మండలంలో 14 గ్రామపంచాయతీలు, 138 వార్డు స్థానాలు ఉన్నాయి. వీటిలో మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 10, వార్డు స్థానాలకు 14 నామినేషన్లు దాఖలు అవ్వగా, రెండో రోజు సర్పంచ్ స్థానాలకు 25, వార్డు స్థానాలకు 90 నామినేషన్లు దాఖలు అయ్యాయి.కోనాపూర్ క్లస్టర్ లో 3 గ్రామ పంచాయతీలు, 24 వార్డులు ఉండగా సర్పంచ్ స్థానాలకు 12, వార్డు స్థానాలకు 25 నామినేషన్లు వచ్చాయి.
కోన సముందర్ క్లస్టర్ పరిధిలో 4 గ్రామ పంచాయతీలు, 36 వార్డులు ఉండగా సర్పంచ్ స్థానాలకు 10, వార్డు స్థానాలకు 30 నామినేషన్లు దాఖలయ్యాయి. చౌట్ పల్లి క్లస్టర్ పరిధిలో 3 గ్రామ పంచాయతీలు, 36 వార్డులు ఉండగా సర్పంచ్ స్థానాలకు 6, వార్డు స్థానాలకు 28 నామినేషన్లు వచ్చాయి. కమ్మర్ పల్లి క్లస్టర్ పరిధిలో 4 గ్రామ పంచాయతీలు, 42 వార్డులు ఉండగా సర్పంచ్ స్థానాలకు 7, వార్డు స్థానాలకు 21 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ తెలిపారు. కాగా నామినేషన్లకు చివరి రోజైన శుక్రవారం పెద్ద మొత్తంలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశానందున అవసరమైన ఏర్పాట్లు అన్ని పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.



