నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని లక్నవరం పంచాయతీలో ప్రచారమే ఒక ప్రభంజనంలా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి సీతారాం నాయక్ దూసుకెళ్తున్నారు. గురువారం దుంపెల్లి గూడెం గ్రామంలో మాజి వైస్ ఎంపీపీ పిఎసిఎస్ డైరెక్టర్ సూది రెడ్డి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సీతారాం నాయకునీ గెలిపించాలని విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి సీతారాం నాయక్ మాట్లాడుతూ కొత్తగా నిలబడిన తనకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి గతానికి ప్రస్తుతానికి తేడా చూపిస్తాను అని అన్నారు.
ఇతరుల మాదిరిగా ప్రతిసారి తనకే కావాలని అధికార దాహం పదవి వ్యామోహం ఆర్థికంగా సంపాదించుకుని ఎదగాలన్న ఆకాంక్ష తనకు లేదని, గ్రామ అభివృద్ధి మాత్రమే తన ముందున్న లక్ష్యమని అన్నారు. అవకాశం కల్పిస్తే అహర్నిశలు గ్రామాభివృద్ధి ప్రధాన అంశంగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను అన్నారు. ఒకే ఒక్కసారి ఆశీర్వదించి అవకాశం ఇవ్వండి మార్పు చూపిస్తాను. అన్నారు. ఏదో ఒక రోజున గ్రామంలో మార్పు అనివార్యం. ఈ ఎన్నికల సందర్భంలో ఆ మార్పు జరగాలనీ గ్రామానికి కొత్తదనం రావాలని నూతన అభివృద్ధి కావాలని ఆశిస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై వేసి గ్రామ నూతన సర్పంచిగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.



