- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల గ్రామ పాలన అధికారుల మల్హర్ రావు మండల కమిటీ ఎన్నికను జిల్లా అధ్యక్షులు బందెల జితేందర్, కొండ్ర జితేందర్ ఆదేశాల మేరకు గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిపిఓ మండల అధ్యక్షులు గా రాసురి శ్రీనివాస్, ఉపాద్యక్షులుగా మేడిపల్లి రాజు, జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ గా గొట్టం నరేష్, కోశాధికారి గా సంపత్ ప్రచార కార్యదర్శి గా మేడిపల్లి రాజేందర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ కె రవి కుమార్ హజరై మాట్లాడారు. గ్రామ పాలన అధికారులు రైతులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తో పాటు జూనియర్ అసిస్టెంట్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



