- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలని భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్ కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు మూడవ విడత జరుగుతున్న నేపథ్యంలో గురువారం మండలంలోని కొయ్యూరులో గల నామినేషన్ సెంటర్ నీ విసిట్ చేసి బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజలు తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల జరుపుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వెర్తీకల్ డిఎస్పీ నారాయణ్ నాయక్,కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేశ్ పాల్గొన్నారు.
- Advertisement -



