నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ లో శ్రీ షిరిడి సాయి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం, దత్త జయంతిని పురస్కరించుకొని గురువారం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సారంగట్ట అయ్యప్ప స్వామి ఆలయ ప్రధాన అర్చకులు యోగేశ్వర్, బాబా ఆలయ పూజారి హన్మాండ్లు ఆధ్వర్యంలో మంత్రోచ్ఛరణాల మధ్య సాయిబాబా విగ్రహానికి విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. బాబా ఉత్సవమూర్తికి మహాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించి, భక్తుల సమక్షంలో పల్లకి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం వార్షికోత్సవ హోమం, పూర్ణాహుతి ఘనంగా నిర్వహించి, ఆలయం వద్ద భక్తులకు పెద్ద ఎత్తున అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు బద్దం గంగారెడ్డి, యెనుగందుల శశిధర్, పోలేపల్లి లచ్చయ్య, నందగిరి దయానంద్, ఉట్నూరి రవి గౌడ్, పోతు గణేష్, పోతు మురళి, పెంబర్తి నరేష్ కుమార్, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
ఉప్లూర్ లో అన్న వితరణ కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



