శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, బరువు పెరుగుదల, హార్మోన్ల అసమతుల్యత వస్తాయి. ఇవి స్త్రీలలో అండాల విడుదలను ప్రభావితం చేస్తాయి. మన దేశంలో పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) వంటి రుగ్మతలు శారీరక శ్రమ లేకపోవడం వల్ల మరింత తీవ్రతరం అవుతాయి. పురుషులలో తక్కువ టెస్టోస్టెరాన్ స్పెర్మ్ నాణ్యత, మొత్తం లైంగిక పనితీరును ప్రభావితం చేస్తుంది.
ఊబకాయం, జీవక్రియ రుగ్మతలు
శారీరక నిశ్చలత్వం ఊబకాయానికి ప్రధాన కారణం. ఊబకాయం సంతానలేమికి ప్రమాద కారకమని నిరూపితమైంది. అధిక శరీర కొవ్వు లైంగిక హార్మోన్ల సమతుల్యతకు భంగం కలిగిస్తుంది, లిబిడోను తగ్గిస్తుంది, అండం, స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఇది మధుమేహం, ఇతర జీవక్రియ సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది, తద్వారా గర్భధారణ కష్టమవుతుంది.
పెరిగిన ఒత్తిడి
నిశ్చల జీవనం రక్త ప్రసరణను తగ్గిస్తుంది, ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతుంది. ఇది అండం, స్పెర్మ్ కణాలకు హాని కలిగిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం యాంటీఆక్సిడెంట్ రక్షణను మెరుగుపరుస్తుంది, కణాల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇది పునరుత్పత్తికి అవసరం.
మానసిక ఆరోగ్యం, ఒత్తిడి
సంతానలేమికి మానసిక ఆరోగ్యానికి దగ్గరి సంబంధం ఉంది. నిశ్చలత్వం డిప్రెషన్, ఆందోళనలకు దారి తీస్తుంది. ఈ రెండు హార్మోన్ల చక్రాలు, లైంగిక పనితీరును దెబ్బతీస్తాయి. రోజూ వ్యాయామం చేయడం కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది, మొత్తం మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది, పరోక్షంగా సంతానోత్పత్తిపై సానుకూల ప్రభావం చూపుతుంది.
నిశ్చల జీవనశైలిని వదిలించుకోవడానికి 5 మార్గాలు
యువకులు రోజూ కనీసం 30 నిమిషాలు మితమైన వ్యాయామం చేయాలి. నడక, యోగా, జిమ్ లేదా క్రీడలు ఇందులో ఉంటాయి.
గంటల తరబడి కూర్చోవడం మానేసి, తరచుగా లేచి స్ట్రెచ్ లేదా నడవాలి.
సమతుల్య ఆహారం, క్రమబద్ధమైన వ్యాయామంతో ఆరోగ్యకరమైన బరువును పాటించాలి.
స్క్రీన్ సమయాన్ని తగ్గించుకుని, చక్కగా నిద్రపోవాలి.
సంతానలేమి సమస్యలు ఉంటే, కుటుంబ నియంత్రణ కోసం వేచి ఉండకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవాలి.
రోజంతా కూర్చుంటే..!
- Advertisement -
- Advertisement -



