హీరో నాగ శౌర్య నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. నూతన దర్శకుడు రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహించారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మించారు. గురువారం మేకర్స్ సినిమాలోని ‘పొమ్మంటే..’ అనే ఎమోషనల్ పాటను విడుదల చేశారు. హారిస్ జయరాజ్ స్వరపరిచిన ఈ పాట మెలోడీ, ఎమోషన్‌తో ఆకట్టుకుంది. విడిపోవడం వల్ల కలిగే బాధను, తోబుట్టువుల అనుబంధాన్ని అందంగా ప్రజెంట్ చేసింది. రచయిత చంద్రబోస్ మనసుకి హత్తుకునే సాహిత్యం రాశారు. గాయకులు విజయ్ యేసు దాస్, శక్తిశ్రీ గోపాలన్ తమ వోకల్స్‌తో మరింత హార్ట్ టచ్చింగ్‌గా మలిచారు. ఈ పాట చాలా కాలం పాటు నిలిచిపోతుంది. విజువల్‌గా ఈ పాటలో నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ మిస్ అండర్ స్టాండింగ్ ద్వారా విడిపోయిన బ్రదర్, సిస్టర్స్‌గా కనిపించారు. ఇది తోబుట్టువుల ప్రేమకు మనసుని కదిలించే సాంగ్ అని చిత్రయూనిట్ తెలిపింది.
అందమైన అనుబంధానికి ప్రతీక..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



